ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన
భక్తుల సౌకర్యాలను పరిశీలించిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు... టోల్గేట్ నుంచి క్యూలైన్ల వరకు ఏర్పాట్లపై ఆరా... యాక్సెస్ గేట్ల పనితీరును పరిశీలించి అధికారుల నుంచి వివరాల సేకరణ...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 10: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు శనివారం సాయంత్రం పరిశీలించారు. టోల్గేట్ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.


ముఖ్యంగా యాక్సెస్ గేట్ల పనితీరు, భక్తుల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ఆలయ పరిసరాల్లోని ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

