ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

గవర్నర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశాం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి శాప్‌ ఘటనలో బాధితులపైనే కేసులు పెట్టారు

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 9:40 AMకి 1,898 వీక్షణలు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 24 : డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కోరినట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శాప్‌ కార్యాలయం వద్ద సెప్టెంబర్‌ 21న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందించినట్లు వెల్లడించారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి పరిధిలో ఉంచడం ద్వారా అక్రమాలకు అవకాశం కల్పించారని ఆరోపించారు. నియామక ప్రక్రియను ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేతుల్లో పెట్టారని, కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన నవీన్‌ పేరును తొలి మెరిట్‌ జాబితాలో చూపించి, తరువాత తొలగించారని పేర్కొన్నారు. అతడి లాగిన్‌ ఐడీని నిలిపివేసి, కాల్‌లెటర్‌ కూడా పంపలేదని చెప్పారు. క్రీడా కోటా పేరుతో ప్రభుత్వ ఉత్తర్వులను మార్చి 372 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారని జగన్‌ ఆరోపించారు. నియామకాలు పూర్తయిన తరువాత మళ్లీ పరీక్ష తప్పనిసరి చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలపైనా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారు. ఉద్యోగాల కోసం బేరసారాలు సాగినట్లు చెబుతున్న దృశ్య, శ్రవణ ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. బాధితులపైనే హత్యాయత్నం కేసులా? శాప్‌ కార్యాలయం వద్ద శాంతియుత నిరసనకు ముందుగానే పోలీసుల అనుమతి కోరినప్పటికీ, అధికార పార్టీకి చెందిన వారిని అక్కడికి రప్పించి ఘర్షణకు కారణమయ్యారని జగన్‌ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులపై దాడులు జరిగినా బాధ్యులపై కేసులు నమోదు చేయకుండా బాధితులపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు సుమారు 350 మందిపై కేసులు నమోదు చేసి, రాత్రివేళ ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు తెరవడాన్ని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించాయని తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపి, పరీక్షల వ్యవస్థపై నిరుద్యోగుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ప్రశ్నించే గొంతులను కేసులతో అణచివేయలేరని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వానికి చెంపదెబ్బ సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బగా జగన్‌ అభివర్ణించారు. పోలీసు ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని న్యాయస్థానం ప్రశ్నించడం కేసు తీవ్రతను తెలియజేస్తోందన్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని కొట్టి చంపడంతోపాటు మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, పోలీసుల అరాచకాలకు ఈ ఘటన నిదర్శనమని జగన్‌ పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086