పార్టీ ప్రచారానికి మైటీడీపీ యాప్ దన్ను
ప్రతి కార్యకర్త యాప్ను వినియోగించాలని సూచన కార్యక్రమాల వివరాలు ఫొటోలు అప్లోడ్ చేయాలని ఆదేశం కార్యకర్తల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించిన నాయకులు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 27: పార్టీ కార్యక్రమాల ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రతి కార్యకర్త మైటీడీపీ యాప్ను సమర్థంగా వినియోగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు ఆదివారం సింగ్నగర్లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలతోపాటు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పర్యటనలు, సమావేశాలకు సంబంధించిన

వివరాలు, ఫొటోలను యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాప్ను ప్రచార వేదికగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, ఐటీడీపీ సెంట్రల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల మొబైల్ ఫోన్లలో మైటీడీపీ యాప్ను డౌన్లోడ్ చేయించి, లాగిన్ ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమాల వివరాలు, ఫొటోలను అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు.

