రాఖీ బంధంతో ఆత్మీయత వెల్లువ
గుడివాడలో రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించిన మహిళలు... ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి: ఎమ్మెల్యే రాము...

గుడివాడలో రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించిన మహిళలు ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి: ఎమ్మెల్యే రాము
గుడివాడ, ఆగస్టు 28: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినాన్ని గుడివాడలో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రాజేంద్రనగర్లోని ఎమ్మెల్యే స్వగృహంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు చెందిన సోదరి శైలజతో పాటు పలువురు కూటమి మహిళా నాయకులు రాముకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.
మోటూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. వారితో రాము ఆప్యాయంగా మాట్లాడి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు, యువత ఆయన ఆశీస్సులు తీసుకోగా, వయసులో పెద్దవారైన మహిళలకు రాము పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
రాఖీ కేవలం ఒక సంప్రదాయం కాదని, సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కుటుంబ బంధాలు బలపడితే సమాజంలో ఆత్మీయత, మానవతా విలువలు మరింత పెరుగుతాయన్నారు.
రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, అందరి జీవితాల్లో ఆరోగ్యం, సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

