ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

86వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

వర్షపు నీరు నిల్వకుండా సత్వర చర్యలు చేపట్టిన టీడీపీ డివిజన్ అధ్యక్షుడు రవికుమార్... కండ్రిక, ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీల శుభ్రత పనులు... ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 6:13 PMకి 4,829 వీక్షణలు
86వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 28: తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని 86వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ పరిధిలోని కండ్రిక, ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీల శుభ్రత పనులు చేపట్టారు. 86వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కాకొల్లు ఝాన్సీ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్ పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షపు నీటి పారుదల పరిస్థితిని పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడిక, ఇతర అడ్డంకులను తొలగించే చర్యలు చేపట్టారు. వర్షపు నీరు రహదారులు, నివాస ప్రాంతాల్లో నిల్వ ఉండకుండా పారుదల వ్యవస్థను మెరుగుపరిచేలా పనులు చేయించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తుఫాను సమయంలో వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందులు పడకుండా వీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. డివిజన్‌లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ 86వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అల్లిక నాదే... నీ ఓటు నాకే!

58 నిమిషాల క్రితం 5,689

జోరు వానలోనూ తగ్గని ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 5,796

85వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం

1 గంట క్రితం 5,862

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు!

2 గంటల క్రితం 3,282