ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

అల్లిక నాదే... నీ ఓటు నాకే!

73వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఎరుబోతు సుజాత ఇంటింటి ప్రచారం... మేదరు బజార్‌లో కులవృత్తుల కార్మికులతో ఆత్మీయ పలకరింపు... సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 6:29 PMకి 5,689 వీక్షణలు
అల్లిక నాదే... నీ ఓటు నాకే! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ సెంట్రల్, అక్టోబర్ 28: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 73వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎరుబోతు సుజాత బుధవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు మేదరు బజార్ ప్రాంతంలో కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఓటరు జాబితాను పరిశీలిస్తూ ఇంటింటికీ వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులతో సుజాత ముచ్చటించారు. వారి జీవనోపాధి, వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కులవృత్తులు సమాజానికి ఎంతో అవసరమని, సంప్రదాయ వృత్తులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. మేదరు వృత్తిదారుల పనితీరును ఆసక్తిగా పరిశీలించిన ఆమె, వారి నైపుణ్యాన్ని అభినందించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. డివిజన్‌లో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని సుజాత తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జోరు వానలోనూ తగ్గని ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 5,796

85వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం

2 గంటల క్రితం 5,862

86వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

2 గంటల క్రితం 4,829

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు!

3 గంటల క్రితం 3,282