ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

85వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం

వర్షపు నీటి నిల్వలు లేకుండా డ్రైనేజీల శుభ్రత పనులు... వీఎంసీ సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టిన వట్టే వెంకటేశ్వరరావు... ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 6:17 PMకి 5,862 వీక్షణలు
85వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 28: డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని 85వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి వట్టే వెంకటేశ్వరరావు అన్నారు. అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీల శుభ్రత పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి డివిజన్ పరిధిలో వట్టే వెంకటేశ్వరరావు పర్యటించారు. విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడిక, ఇతర అడ్డంకులను తొలగించి వర్షపు నీరు సజావుగా పారేలా చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాలు, రహదారులపై నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వట్టే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వర్షాల సమయంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డివిజన్‌లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అల్లిక నాదే... నీ ఓటు నాకే!

1 గంట క్రితం 5,689

జోరు వానలోనూ తగ్గని ఎన్నికల ప్రచారం

2 గంటల క్రితం 5,796

86వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

2 గంటల క్రితం 4,829

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు!

3 గంటల క్రితం 3,282