ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు… ఎన్టీఆర్ జిల్లాకు అత్యధికంగా 804 బస్సులు… విజయవాడకు 1,053 ప్రత్యేక సర్వీసులు… ఈ నెల 16 నుంచి 25 వరకు ప్రత్యేక రవాణా… పండుగకు ముందు 3,207, తర్వాత 2,054 బస్సులు…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 7:47 PMకి 3,478 వీక్షణలు
దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 8: దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. విజయవాడకు పెద్దపీటజోన్ల వారీగా మొదటి జోన్‌లో 1,107, రెండో జోన్‌లో అత్యధికంగా 2,218, మూడో జోన్‌లో 818, నాలుగో జోన్‌లో 1,118 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. జిల్లాల వారీగా ఎన్టీఆర్ జిల్లాకు 804, విశాఖపట్నానికి 416, ఏలూరుకు 340, వైఎస్సార్ కడపకు 318, శ్రీకాకుళానికి 279, తూర్పుగోదావరికి 260, ప్రకాశం జిల్లాకు 245, కాకినాడకు 224 బస్సులు కేటాయించారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు పండుగ సందర్భంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. దసరా ముగిసిన అనంతరం స్వస్థలాల నుంచి ఉద్యోగ, వ్యాపార ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086