కార్మికుల సంక్షేమానికి కాకా చేసిన సేవలు చిరస్మరణీయం
గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు… అంబేడ్కర్ భవన్‌లో చిత్రపటానికి పూలమాలలు… కార్మిక నేతగా, తెలంగాణ యోధుడిగా కాకా సేవలు ఆదర్శం: గొళ్ళ అరుణ్‌కుమార్…

గుంటూరు, అక్టోబరు 5: మాజీ కేంద్ర మంత్రి, కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ యోధుడు గడ్డం వెంకటస్వామి ‘కాకా’ 97వ జయంతి కార్యక్రమాన్ని గుంటూరు నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గొళ్ళ అరుణ్‌కుమార్, భీమ్‌సేన్ సేవాదళ్ అధ్యక్షుడు నల్లపు నీలాంబరం తదితరులు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బత్తుల అనిల్, తిప్పాబత్తిన గోవిందు, దార్ల అర్జున్, విప్పర్ల ముత్తయ్య, వట్టిమొక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

