ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఆటో వెనుక పోలీసుల వేట.. సొత్తు సురక్షితం

రాపిడో ఆటోలో విలువైన వస్తువులు మరిచిన మహిళ… సాంకేతిక సమాచారంతో బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై ఆటో గుర్తింపు… బంగారం, వెండి పట్టీలు, ఏటీఎం కార్డులు బాధితురాలికి అప్పగింత…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 10:17 PMకి 2,597 వీక్షణలు
ఆటో వెనుక పోలీసుల వేట.. సొత్తు సురక్షితం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 3: రాపిడో ఆటోలో మహిళ మరిచిపోయిన విలువైన ఆభరణాల బ్యాగును అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు అరగంటలోనే గుర్తించి ఆమెకు అప్పగించారు. శనివారం రాత్రి ఓ మహిళ విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి అజిత్‌సింగ్‌నగర్‌లోని జయమ్మ కంటి ఆసుపత్రికి రాపిడో ఆటోలో వచ్చారు. రాత్రి సుమారు 7.45 గంటలకు ఆసుపత్రి వద్ద దిగుతున్న సమయంలో బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, ఏటీఎం కార్డులు, ఇతర విలువైన వస్తువులు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తరువాత విషయాన్ని గుర్తించిన బాధితురాలు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు రాపిడో బుకింగ్‌ వివరాలు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని సేకరించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై వెళ్తున్న సంబంధిత ఆటోను గుర్తించారు. సుమారు అరగంటలోనే ఆటోను ట్రేస్‌ చేసి అందులో ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులోని బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, ఏటీఎం కార్డులు, ఇతర వస్తువులు భద్రంగా ఉన్నట్లు నిర్ధారించి బాధితురాలికి అప్పగించారు. విలువైన వస్తువులను వేగంగా గుర్తించి అందించిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుల తక్షణ స్పందన, సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086