ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కూలిన చెట్లు.. అప్రమత్తమైన యంత్రాంగం

తూర్పు నియోజకవర్గంలో కూలిన భారీ వృక్షాల పరిశీలన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే గద్దె ఆదేశం కొండ ప్రాంతాలు, పురాతన భవనాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 5:49 PMకి 3,224 వీక్షణలు
కూలిన చెట్లు.. అప్రమత్తమైన యంత్రాంగం — చిత్రం 1
కూలిన చెట్లు.. అప్రమత్తమైన యంత్రాంగం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 24: అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సూచించారు. వర్షాలు, బలమైన గాలులతో నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులను గురువారం ఆయన పరిశీలించారు. ఆరో డివిజన్‌ గుమ్మడి బజారులో నేలకూలిన పెద్ద వృక్షాన్ని, 19వ డివిజన్‌ పకీరుగూడెం కమ్యూనిటీ హాలు సమీపంలో ఓ ఇంటిపై పడిన భారీ చెట్టును ఎమ్మెల్యే పరిశీలించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని గద్దె రామమోహన్‌ కోరారు.

కూలిన చెట్లు.. అప్రమత్తమైన యంత్రాంగం — అదనపు చిత్రం 2

కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కొండరాళ్లు జారిపడే ప్రమాదమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి సమాచారం అందించాలని సూచించారు. అలాంటి ప్రాంతాల్లో అధికారులను పంపించి రక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. పురాతన భవనాలు, భారీ చెట్ల సమీపంలో నివసిస్తున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పడాల గంగాధర్‌, భాగం సాయిప్రసాద్‌, రత్న రమేష్‌, పడమట సతీష్‌చంద్ర, దయాల శిరీష గాంధీ, పడాల వాసు, దున్న యేసురత్నం, నిమ్మల జ్యోతి, కోటివిడతల కోటేశ్వరరావు, పునుగుపాటి మోహన్‌రావు, పరసా రఘు, పడాల నాగు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086