ప్రధానిని కలిసిన ఏపీ నూతన రాజ్యసభ సభ్యులు
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన నలుగురు నూతన రాజ్యసభ సభ్యులు... సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని.... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించాలని ఎంపీలకు సూచించిన నరేంద్ర మోదీ...

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నూతన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పార్లమెంట్‌లో సమర్థవంతంగా పనిచేయాలని, రాష్ట్రాభివృద్ధితో పాటు దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం.

