ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఎన్టీఆర్‌ జిల్లాలో నేడు బడులకు సెలవు

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తింపు విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా విద్యాశాఖ నిర్ణయం అనవసర ప్రయాణాలు చేయకుండా ఇళ్లలోనే ఉండాలని సూచన

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 8:24 AMకి 1,970 వీక్షణలు
ఎన్టీఆర్‌ జిల్లాలో నేడు బడులకు సెలవు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ , సెప్టెంబర్ 23 : ఎన్టీఆర్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెలవు వర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను నిర్వహించరాదని, విద్యార్థులను తరగతులకు పిలిపించవద్దని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. సెలవు సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలని సూచించింది. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ప్రతి పాఠశాలకు సమాచారం చేరేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. వర్షాలు, వరదలు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. విద్యార్థులు, సిబ్బంది అనవసర ప్రయాణాలు చేయకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. పాఠశాలల పునఃప్రారంభం, తదుపరి విద్యా కార్యక్రమాలపై అధికారికంగా సమాచారం వెల్లడిస్తామని జిల్లా విద్యాశాఖ తెలిపింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086