ఉత్తమ పనితీరుకు పోలీసులకు ప్రశంసా పత్రాలు
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి గౌరవం... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందజేత... ఎస్ఐ అనూష, కానిస్టేబుళ్లు వెంకటేష్, బుజ్జిబాబులకు ప్రశంసా పత్రాలు...

ఆగస్టు 15 — V10TV AP: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ అనూష, కానిస్టేబుళ్లు వెంకటేష్, బుజ్జిబాబులు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కేసుల దర్యాప్తు, విధి నిర్వహణలో సమర్థత చూపినందుకు ఈ గుర్తింపు లభించింది.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ఇటువంటి గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

