ఆరోగ్యాలయంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పేషంట్లలో భయాందోళన
మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు... అప్రమత్తమైన సిబ్బంది సమాచారంతో రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.. ఘటనపై అధికారుల విచారణ....

అమరావతి ఆగస్టు 18 (V10TV AP): అమరావతిలోని మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడున్న పేషంట్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంటలను గుర్తించిన ఆశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏమిటనే దానిపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

