ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ18, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు..!

సంచుల నిండా కట్టల కట్టలుగా నగదు... ఆయుధాల కోసం సోదాలు చేస్తే బయటపడిన భారీ మొత్తం... ఐదు గంటలు లెక్కించి రూ.3 కోట్ల నగదు స్వాధీనం...

V10TV న్యూస్ డెస్క్ 18 ఆగస్టు, 2026 3:41 PMకి 1,123 వీక్షణలు
ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు..! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

సాగర్, ఆగస్టు 18: మధ్యప్రదేశ్‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో ఏకంగా రూ.3 కోట్ల నగదు బయటపడటం కలకలం రేపింది. ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. ఆయుధాల జాడ కనిపించలేదు. కానీ సంచుల నిండా కట్టల కట్టలుగా నగదు కనిపించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సాగర్‌లోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రాజేశ్ అహిర్వార్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ ఇటీవల తుపాకీతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. దీంతో అతని వద్ద ఆయుధాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇంట్లో ఎంత వెతికినా ఆయుధాలు లభించలేదు. అయితే తనిఖీల్లో భారీగా నగదు ఉన్న సంచులు బయటపడ్డాయి. ఆటో డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు నగదు లెక్కింపు యంత్రాలను తెప్పించారు. సుమారు ఐదు గంటల పాటు లెక్కించగా మొత్తం రూ.3 కోట్లుగా తేలినట్లు సమాచారం.

నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇంత భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఆ నగదుతో తమకు సంబంధం లేదని, భోపాల్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమ బంధువు కుటుంబానికి చెందినదని వారు చెప్పినట్లు సమాచారం.

అయితే రూ.3 కోట్ల నగదు ఆటో డ్రైవర్ ఇంటికి ఎందుకు వచ్చింది? దాని అసలు యజమాని ఎవరు? నగదుకు సంబంధించిన లెక్కలు, ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న జనరల్ స్టోర్..!

1 గంట క్రితం 1,255

త్వరలో మరో 3 వేల టీచర్ పోస్టుల భర్తీ: బోండా ఉమ

1 గంట క్రితం 3,142

గ్రామాల్లో తగ్గిన నిరుద్యోగ రేటు

2 గంటల క్రితం 1,257

ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి

2 గంటల క్రితం 2,366