క్రమబద్ధీకరణ కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన
మచిలీపట్నంలో వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల భారీ నిరసన… జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ కూడలి వరకు ప్రదర్శన… ఉద్యోగులకు సీఐటీయూ, ఏపీ ఎన్జీఓ సంఘాల సంఘీభావం…

మచిలీపట్నం, అక్టోబర్ 3 : వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు మచిలీపట్నంలో కొవ్వొత్తులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ప్రారంభమైన ప్రదర్శన లక్ష్మీ టాకీస్ కూడలి వరకు కొనసాగింది. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ నిరసనకు సీఐటీయూ, ఏపీ ఎన్జీఓ సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
