రాయచోటిలో టీడీపీ–వైసీపీ శ్రేణుల ఘర్షణ
నామినేషన్ల సందర్భంగా ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఉద్రిక్తత… పరస్పరం రాళ్లదాడులు.. వాహనాల ధ్వంసం, దగ్ధమైనట్లు సమాచారం… పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల చర్యలు…

రాయచోటి, అక్టోబర్ 16: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 కార్లు ధ్వంసం కాగా, నాలుగు కార్లకు నిప్పంటించినట్లు సమాచారం అందుతోంది. పోలీసు వాహనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డీఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం వస్తోంది. వాహనాల నష్టం, గాల్లోకి కాల్పుల వివరాలపై పోలీసుల అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

