గన్నవరం చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉప రాష్ట్రపతికి ఆహ్వానం... ముసునూరులో నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి...

గన్నవరం, ఆగస్టు 24: భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.
ఉప రాష్ట్రపతికి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గన్నవరం విమానాశ్రయం నుంచి నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరుకు బయలుదేరారు. ముసునూరులో గౌర్మెట్ పాప్ కార్నికా రూపొందించిన నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో గన్నవరం నుంచి ముసునూరు వరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

