విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం... మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా... మృతుడి వివరాల కోసం మాచవరం పోలీసుల ఆరా...

విజయవాడ, ఆగస్టు 24: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు మాచవరం పోలీసులు తెలిపారు.
ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడికి సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడి గుర్తింపును నిర్ధారించేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.

