కానుల శేఖర్‌ను పరామర్శించిన నాగుల్ మీరా
మోకాలి ఆపరేషన్ అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా... కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కార్పొరేషన్ చైర్మన్... త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష...

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ సీనియర్ నాయకుడు కానుల శేఖర్‌కు ఇటీవల మోకాలి ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె. నాగుల్ మీరా మంగళవారం ఉదయం శేఖర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. శేఖర్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నాగుల్ మీరా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరాతో పాటు ఎన్టీఆర్ జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షుడు కాజా రహమతుల్లా, 47వ డివిజన్ యూనిట్ ఇన్చార్జి గూడేల ఉమామహేశ్వరరావు, మల్లెపు రాజు, పైలా నరసింహారావు, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు కొంగరపు భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

