ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

పరిశుభ్రత కోసం పది వేల మందితో భారీ పరుగు

అక్టోబర్‌ 2న విజయవాడ–అమరావతి మధ్య ‘స్వచ్ఛతాన్‌’ మారథాన్‌ ఐదు, పది, ఇరవై ఒక్క కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు... విజేతలకు రూ.10 లక్షల నగదు బహుమతులు... వివరాలు వెల్లడించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 4:10 PMకి 2,372 వీక్షణలు
పరిశుభ్రత కోసం పది వేల మందితో భారీ పరుగు — చిత్రం 1
పరిశుభ్రత కోసం పది వేల మందితో భారీ పరుగు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 29: పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అక్టోబర్‌ 2న విజయవాడ–అమరావతి ప్రాంతంలో పది వేల మందితో ‘స్వచ్ఛతాన్‌’ మారథాన్‌ నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మారథాన్‌ వివరాలను వెల్లడించారు. మహాత్మా గాంధీ జయంతి, స్వచ్ఛ దివస్‌ను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో 2025 జనవరి నుంచి ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ ఉద్యమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు వివరించారు. గతేడాది నిర్వహించిన తొలి స్వచ్ఛతాన్‌లో ఆరు వేల నుంచి ఏడు వేల మంది పాల్గొన్నారని, ఈసారి సుమారు పది వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఐదు, పది, ఇరవై ఒక్క కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు మొత్తం రూ.10 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. అక్టోబర్‌ 2న ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి మారథాన్‌ ప్రారంభమవుతుందన్నారు. మంత్రి నారా లోకేశ్‌ జెండా ఊపి పరుగును ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేశ్‌,

పరిశుభ్రత కోసం పది వేల మందితో భారీ పరుగు — అదనపు చిత్రం 2

పొంగూరు నారాయణతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, వినాయకుడి గుడి, సీతమ్మవారి పాదాలు, ప్రకాశం బ్యారేజీ, స్టీల్‌ బ్రిడ్జి మీదుగా అమరావతి రాజధాని ప్రాంతంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు పరుగు కొనసాగి తిరిగి విజయవాడకు చేరుకుంటుందని వివరించారు. పది, ఇరవై ఒక్క కిలోమీటర్ల విభాగాల రన్నర్లకు సమయాన్ని నమోదు చేసే ప్రత్యేక గుర్తింపు పత్రాలను అమ్మ కల్యాణ మండపం వద్ద అందించనున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో రన్నర్లను ప్రోత్సహించేందుకు డప్పు కళాకారులు, సాంస్కృతిక బృందాలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌, నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో బందోబస్తు, మార్గం క్లియరెన్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నమోదు చేసుకోని వారికి కూడా ఐదు కిలోమీటర్ల పరుగులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం సిద్ధమవుతున్న తరుణంలో స్వచ్ఛతాన్‌ మారథాన్‌ ముందస్తు వేడుకగా నిలుస్తుందని పట్టాభిరామ్‌ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో అమరావతి రన్నర్స్‌ ప్రతినిధి రావి రమేష్‌, హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి పవన్‌, మెడ్‌స్టార్‌ ఆసుపత్రుల ప్రతినిధి ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086