ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, నవంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి!

చైర్మన్ పదవి హోదా కాదు.. ప్రజాసేవకు గొప్ప బాధ్యత అని రాజేంద్రప్రసాద్ హితవు... రాజకీయ గురువు రాజేంద్రప్రసాద్‌ను కుటుంబ సమేతంగా కలిసిన ప్రవీణ్ కుమార్... ఉయ్యూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా.. చైర్మన్ ప్రవీణ్ కుమార్...

V10TV న్యూస్ డెస్క్ 5 నవంబర్, 2026 2:13 PMకి 7,598 వీక్షణలు
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఉయ్యూరు, నవంబర్ 5 : మున్సిపల్ చైర్మన్ పదవి కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ గురువారం కుటుంబ సమేతంగా రాజేంద్రప్రసాద్ దంపతులను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో తనకు తొలి అడుగుల నుంచి మార్గదర్శకత్వం వహించిన రాజేంద్రప్రసాద్ తన రాజకీయ గురువని పేర్కొన్నారు. రాజకీయ ఓనమాలు ఆయన వద్దే నేర్చుకున్నానని, ప్రతి సందర్భంలోనూ తనను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారని తెలిపారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక కావడంలో ఆయన సహకారం, మార్గదర్శకత్వం ఎంతో కీలకమన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆయన ఆశయాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్ దంపతులు నూతన చైర్మన్ ప్రవీణ్ కుమార్ దంపతులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబ, ప్రవీణ్ కుమార్ సతీమణి చెదుర్తిపాటి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గుడివాడలో కూటమి విజయంపై వెనిగండ్ల రాము ధీమా!

ఈ నిమిషం 8,845

ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిసిన మేయర్ వంగవీటి రాధాకృష్ణ

21 నిమిషాల క్రితం 8,468

ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి దీపావళి కానుక!

1 గంట క్రితం 7,567

ఏపీలో మధ్యాహ్నం ఒంటిగంటకు 30.50 శాతం పోలింగ్!

2 గంటల క్రితం 9,839