ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ4, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

చిల్లర గొడవ.. కండక్టర్ ప్రాణం తీసింది!

చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సులో నుంచి నెట్టేసిన ప్రయాణికురాలు... వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడిన ప్రవళిక... పది రోజులు మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో కన్నుమూత...

V10TV న్యూస్ డెస్క్ 4 నవంబర్, 2026 10:44 AMకి 6,598 వీక్షణలు
చిల్లర గొడవ.. కండక్టర్ ప్రాణం తీసింది! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మణుగూరు, నవంబర్ 4: కేవలం చిల్లర డబ్బుల కోసం జరిగిన వివాదం ఓ మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాలను బలితీసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌ను ఓ ప్రయాణికురాలు బస్సులో నుంచి నెట్టివేయడంతో తీవ్రంగా గాయపడిన గుండ్ల ప్రవళిక (24) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బానోత్ మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ప్రయాణించింది. కుమారుడి టికెట్ కోసం రూ.100 నోటు ఇవ్వగా, కండక్టర్ ప్రవళిక రూ.10 టికెట్ జారీ చేసి మిగిలిన చిల్లర వివరాలను టికెట్ వెనుక రాసినట్లు సమాచారం. అయితే చిల్లర వెంటనే ఇవ్వాలని మౌనిక పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం సమీపంలో బస్సు కదులుతుండగా మౌనిక కండక్టర్‌ను కిందకు నెట్టివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుపై నెట్టివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుపై పడిపోయిన ప్రవళిక కాళ్లపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాదాపు పది రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రవళిక చివరకు కన్నుమూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రయాణికురాలు మౌనికను అక్టోబర్ 26న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రవళిక మృతితో ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మూడు ముళ్లకు ముందే శక్తి టీమ్ బ్రేక్!

2 గంటల క్రితం 7,569

బెజవాడ మేయర్ పీఠంపై వంగవీటి జయకేతనం!

4 గంటల క్రితం 52,683

చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ జగన్ సెటైర్లు!

14 గంటల క్రితం 9,810

మచిలీపట్నం మేయర్‌గా అబ్దుల్ అబీదా ఘన విజయం!

16 గంటల క్రితం 7,537