కూటమి విజయమే లక్ష్యం
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి... టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలి... 38వ డివిజన్‌లో పత్తి నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలి...

విజయవాడ, అక్టోబర్ 22 : రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ప్రముఖ నాయకుడు చెన్నుపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భవానీపురం శివాలయం సెంటర్‌లో గురువారం 38వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పత్తి నాగేశ్వరరావు నూతన ఎన్నికల కార్యాలయాన్ని వారు ఘనంగా ప్రారంభించారు. సమన్వయంతో ముందుకు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం.. 38వ డివిజన్ పరిధిలోని ఓటర్లను నేరుగా కలిసి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను వివరించాలని నాయకులు కోరారు. కూటమి అభ్యర్థి పత్తి నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, నియోజకవర్గ ముఖ్య ప్రతినిధులు, కార్యకర్తలు, కూటమి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

