మైలవరం నూతన ఏసీపీకి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఘన సన్మానం
మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏసీపీ పెరవల్లి రామచంద్రరావు శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై చర్చ పోలీసు–ప్రజల సమన్వయానికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ

తిరువూరు, ఆగస్టు 6 (వి10టివి): మైలవరం ఏసీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పెరవల్లి రామచంద్రరావు గురువారం తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువా కప్పి ఏసీపీని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో తిరువూరు నియోజకవర్గంలోని శాంతిభద్రతలు, ప్రజల భద్రత, పోలీసు–ప్రజల సమన్వయం, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖతో సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగగా, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, తిరువూరు పట్టణ నాయకులు పాల్గొన్నారు.

