సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు
ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న మంత్రి డోలా... గతంలో రెండు సంవత్సరాల సేవకు నోషనల్ ఇంక్రిమెంట్లు... త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ...

అమరావతి, సెప్టెంబర్ 28: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు అందించే అంశంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. గతంలో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు రెండేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 15 వేల మందికి పైగా ఉద్యోగులు తనకు వినతిపత్రాలు అందజేశారని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని మంత్రి డోలా హామీ ఇచ్చారు.

