ఆర్నాబ్ బీభత్సం.. కేంద్ర సాయం కోరిన చంద్రబాబు!
అమిత్ షాకు సీఎం అత్యవసర లేఖ.. నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి... 32 వేల మంది అధికారులతో సమీక్ష.. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితుల పరిశీలన... నీటమునిగిన పంటలు.. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు ఆదేశాలు...

అమరావతి, అక్టోబర్ 29 : ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పంటలు నీటమునగడంతో పాటు రహదారులు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి తక్షణ ఆర్థిక సాయం కోరారు. తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సుమారు 32 వేల మంది అధికారులు, సిబ్బందితో సీఎం సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా జిల్లాల్లో పరిస్థితులను పరిశీలించారు. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. పంట నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

