సుజనా చొరవతో బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్ఓసీ
ప్యాంక్రియాటైటిస్తో బాధపడుతున్న వించిపేటకు చెందిన ఎల్.కిరణ్కు వైద్య సాయం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4.50 లక్షల ఎల్ఓసీ మంజూరు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు పత్రాల అందజేత

విజయవాడ, ఆగస్టు 26: ప్యాంక్రియాటైటిస్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరైంది. వించిపేటకు చెందిన ఎల్.కిరణ్ (40) ప్యాంక్రియాటైటిస్తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి విజ్ఞప్తిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసీ మంజూరుకు చొరవ చూపారు. దీంతో రూ.4 లక్షల 50 వేల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. ఈ పత్రాన్ని భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొణిజేటి రమేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

