డయాగ్నోస్టిక్స్‌లో డేటా చోరీ కలకలం
రహస్య సమాచారాన్ని కాపీ చేసి ఇతరులకు పంపినట్లు ఆరోపణలు… మాజీ సూపర్‌వైజర్‌పై సంస్థ మేనేజర్ ఫిర్యాదు… సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు…

విజయవాడ, అక్టోబర్ 17: విజయవాడలోని ఓ డయాగ్నోస్టిక్స్ సంస్థకు చెందిన రహస్య సమాచారాన్ని అనుమతి లేకుండా కాపీ చేసి ఇతరులకు పంపినట్లు వచ్చిన ఫిర్యాదుపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థలో గతంలో సూపర్‌వైజర్‌గా పనిచేసిన మురళీకృష్ణపై సంస్థ మేనేజర్ సాయి దుర్గశ్రీ ఫిర్యాదు చేశారు. వైద్య రికార్డులు, పరీక్షల నివేదికలు, ఆడిట్ పత్రాలు, ధరల వివరాలకు సంబంధించిన డేటాను మురళీకృష్ణ కాపీ చేస్తుండగా సిబ్బంది గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ రహస్య సమాచారాన్ని ఇతరులకు చేరవేశారని ఆరోపించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

