వైస్ ప్రిన్సిపల్ అనుమానాస్పద మృతి
కానూరులోని శ్రీ భవిష్య క్యాంపస్‌లో ఘటన… యాజమాన్యం కొట్టి చంపిందని కుటుంబ సభ్యుల ఆరోపణ… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పెనమలూరు పోలీసులు…

పెనమలూరు, అక్టోబర్ 17: కానూరు ఆటోనగర్ రోడ్డులోని శ్రీ భవిష్య క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఐలా భాగ్యరాజు (33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గత ఆరేళ్లుగా ఆయన ఈ సంస్థలో పనిచేస్తున్నారు. క్యాంపస్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు క్యాంపస్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. సంస్థ యాజమాన్యం భాగ్యరాజును కొట్టి చంపిందని ఆరోపించారు. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచినట్లు సమాచారం. పెనమలూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యరాజు మృతికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యుల ఆరోపణలపై దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.

