బస్సు, మెట్రోలో తెలంగాణ మంత్రుల ప్రయాణం
ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ పనితీరుపై ప్రత్యక్ష పరిశీలన… ప్రయాణికులతో ముచ్చటించి సలహాలు స్వీకరించిన మంత్రులు… రద్దీ పెరగడంతో ఎస్కలేటర్ నిలిచిపోయి కొద్దిసేపు గందరగోళం…

హైదరాబాద్, అక్టోబర్ 3: హైదరాబాద్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ పనితీరును పరిశీలించేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి శనివారం ప్రజా రవాణాలో ప్రయాణించారు. తొలుత బేగంపేట వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రులు అనంతరం బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రో రైలులో వెళ్లారు. కామన్ పాస్ వినియోగం, బస్సు–మెట్రో అనుసంధానం, ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. మంత్రుల రాకతో మెట్రో స్టేషన్‌లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఎస్కలేటర్ నిలిచిపోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

