బాధితురాలి వైద్యానికి రూ.7.16 లక్షల సాయం
బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న మహిళకు ఆర్థిక చేయూత… ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్ఓసీ మంజూరు… బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాన్ని అందజేసిన ప్రత్తిపాటి శ్రీధర్…

విజయవాడ, నవంబర్ 11: బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న మహిళ వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7.16 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో మంజూరైన ఈ పత్రాన్ని బుధవారం ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 58వ డివిజన్ బాప్టిస్ట్పాలెంకు చెందిన గౌడిపేరు స్వర్ణలత (45) బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతూ మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవ చూపడంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7.16 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

