గాంధీ బాటే దేశానికి దిక్సూచి: కె.వి.చౌదరి
సత్యం, అహింస, శాంతి, సేవలను ఆచరించడమే మహాత్ముడికి నిజమైన నివాళి… స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్న గాంధీ హిల్… మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి…

విజయవాడ, అక్టోబర్ 3: మహాత్మా గాంధీ ఆశయాలు దేశానికి ఎప్పటికీ మార్గదర్శకమని మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి అన్నారు. గాంధీ హిల్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీ హిల్‌పై నిర్వహించిన మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.వి.చౌదరి మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సేవ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించడమే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గం నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. గాంధీ హిల్ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ గాంధీ పి.సి.కాజా, బి.ఎస్.మూర్తి, డి.రామకృష్ణ, మాజీ మేయర్ జంధ్యాల శంకర్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

