ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ10, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బియ్యం ధరల మంట.. సామాన్యుడి బతుకు భారం!

25 కిలోల బియ్యం బస్తా రూ.2,500కు చేరిందని ఆందోళన… ధరల పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ… బియ్యం ధరలను నియంత్రించాలని సీపీఐ నేత లంకా గోవిందరాజులు డిమాండ్…

V10TV న్యూస్ డెస్క్ 10 నవంబర్, 2026 5:43 PMకి 7,292 వీక్షణలు
బియ్యం ధరల మంట.. సామాన్యుడి బతుకు భారం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 10 : రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు లంకా గోవిందరాజులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బియ్యం ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తారుమారవుతోందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బియ్యం ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ మధురానగర్ నేతాజీ రోడ్డులోని చంద్ర రాజేశ్వరరావు రీడింగ్ రూమ్‌లో నిర్వహించిన 67వ డివిజన్ సీపీఐ బ్రాంచ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బస్తాపై వెయ్యి రూపాయలకుపైగా పెంపు కొంతకాలం క్రితం రూ.1,200 నుంచి రూ.1,500 వరకు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.2,300 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని గోవిందరాజులు పేర్కొన్నారు. కిలో బియ్యం ధర రూ.90 నుంచి రూ.100కు పైగా చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. బస్తాపై ఒక్కసారిగా వెయ్యి రూపాయలకు పైగా భారం పడితే రోజువారీ కూలీలు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ధాన్యం నిల్వలున్నా ధరల పెరుగుదల ఎందుకు? రాష్ట్రంలో ధాన్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే అంశంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. బియ్యం దుకాణాలపై నిఘా పెంచాలి బియ్యం దుకాణాల్లో ధరల పట్టికలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు బియ్యం లభించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అక్రమ నిల్వలు, కృత్రిమ ధరల పెంపు వంటి అంశాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక పార్టీ కార్యదర్శి యాదల మల్లికార్జునరావు (శివ), మహిళా సమైక్య నాయకురాలు గోగా కృష్ణకుమారి, యువజన నాయకులు సాదిక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మెరుగైన వైద్యానికి రూ.9.74 లక్షల చేయూత!

1 గంట క్రితం 5,923

గర్భిణుల ఆరోగ్యానికి సుజనా ఫౌండేషన్ భరోసా!

1 గంట క్రితం 5,875

వాట్సాప్ ఫొటోలతోనే సమస్యకు పరిష్కారం!

2 గంటల క్రితం 8,263

కలిసికట్టుగా కదులుదాం.. బెజవాడను అభివృద్ధి చేద్దాం!

2 గంటల క్రితం 4,854