ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సమస్యలు వినేవారేరీ.. గేటుకే వినతిపత్రం!

మైలవరం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల నిరసన… కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో గేట్లకు వినతిపత్రం… కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 3:34 PMకి 2,489 వీక్షణలు
సమస్యలు వినేవారేరీ.. గేటుకే వినతిపత్రం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మైలవరం, అక్టోబరు 6: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన ఆశా కార్యకర్తలు అక్కడ వినతిపత్రం స్వీకరించేందుకు ఎవరూ లేకపోవడంతో కార్యాలయ గేట్లకు వినతిపత్రం కట్టి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మైలవరంలో ఈ ఆందోళన నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి సంఘం ఎన్టీఆర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ సుధాకర్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పి.జ్యోతి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం మూసి ఉండటంతో గేట్లకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సీహెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు, చాలీచాలని వేతనాలతో ఆశా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పనిభారం పెరుగుతున్నా వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందజేసే విషయాన్ని ముందుగానే కార్యాలయ ప్రతినిధులకు తెలియజేసినా, స్వీకరించేందుకు కనీసం వ్యక్తిగత సహాయకుడు కూడా అందుబాటులో లేకపోవడం సమంజసం కాదని సీహెచ్‌ సుధాకర్‌ అన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన కార్యాలయం మూసి ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో మరో వందకుపైగా ఆశా కార్యకర్తల పోస్టులు అవసరమని, జనాభాకు అనుగుణంగా పోస్టులను పెంచి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని కోరారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించి, ఉద్యోగాలను శాశ్వతం చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. వారాంతపు, పండుగ, సాధారణ, వైద్య సెలవులు కల్పించాలని, ఆరోగ్య కేంద్రాలకు వెళ్లినప్పుడు ప్రయాణ, దినభత్యాలు చెల్లించాలని కోరారు. రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్‌ ఫోన్లు, యూనిఫాం అందించాలని, గ్రాట్యుటీ పరిమితిని తొలగించాలని పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, శిక్షణ పొందిన అర్హులైన ఆశాలకు శాశ్వత పోస్టుల నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్చి సమాన పనికి సమాన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల నాయకులు జి.సంతోషం, సులోచన, నాగమణి, ప్రశాంతి, ఉష, సునీత, తిరుపతమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086