ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సమృద్ధిగా వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

కాళీమాత ఆలయంలో వరుణ యాగం పూర్ణాహుతి… ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గద్దె అనురాధ… సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 2:46 PMకి 2,459 వీక్షణలు
సమృద్ధిగా వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి — చిత్రం 1
సమృద్ధిగా వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆకాంక్షించారు. కృష్ణలంక స్టాండ్‌ వద్దనున్న శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతిలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ కృష్ణా, గోదావరితోపాటు రాష్ట్రంలోని జలవనరులన్నీ నిండుకుండల్లా మారి ఆంధ్రప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సమృద్ధిగా వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి — అదనపు చిత్రం 2

నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని పేర్కొన్నారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ–నీవాతోపాటు వివిధ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు సమృద్ధిగా అందాలన్న ప్రభుత్వ సంకల్పానికి దైవానుగ్రహం తోడవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి జగదీష్‌ కుమార్‌, ఆధ్యాత్మికవేత్త కిరణ్‌, ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు తుర్లపాటి మల్లేశ్వరరావు, నాయకులు పెద్ది అన్నారావు, తోట శ్రీను, కోట శివలక్ష్మి, దుర్గారావు, శివ, రవి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086