కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి దసరా ఏర్పాట్లపై నిఘా!
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు... సీసీ కెమెరాల ద్వారా క్యూలైన్లు, దర్శన ఏర్పాట్ల పరిశీలన… భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి…

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ, దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కొండ దిగువన మోడల్ ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తదితరులు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పరిస్థితులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.

