దుర్గమ్మకు రూ.76 లక్షల వజ్రాల కిరీటం
వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని తయారు చేయించిన భక్తుడు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించేందుకు ఏర్పాట్లు ఆలయ అధికారుల ఆమోదంతో బహూకరణకు సన్నాహాలు

విజయవాడ, సెప్టెంబర్ 28: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారికి రూ.76 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఈ కిరీటాన్ని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు సమాచారం. దసరా ఉత్సవాల సందర్భంగా వజ్రాల కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నట్లు తెలిసింది. దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణకు స్నేహితుడైన ఓ భక్తుడు కొన్ని రోజుల క్రితం అమ్మవారికి కిరీటం చేయించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఛైర్మన్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వైదిక కమిటీ సభ్యులతో చర్చించగా వారు అంగీకరించినట్లు సమాచారం. దసరా ఉత్సవాల్లో కిరీటాన్ని అమ్మవారికి బహూకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

