అంతరిక్ష రంగంలో ఏపీకి కొత్త దిశ!
పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతిక ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి... డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.. వేగమే మా ప్రత్యేకత... అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక చర్చలో మంత్రి నారా లోకేష్...

విశాఖపట్నం, నవంబర్ 13: అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అంతరిక్ష సాంకేతికతకు పెరగనున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో సమగ్ర స్పేస్ ఎకానమీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అంతరిక్ష రంగానికి అవసరమైన విడిభాగాల తయారీ సంస్థలను ఈ వ్యవస్థలో భాగస్వాములను చేయడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. విడిభాగాల తయారీకి ప్రాధాన్యం అంతరిక్ష రంగ అభివృద్ధి అంటే కేవలం ఉపగ్రహాల ప్రయోగాలకే పరిమితం కాదని, వాటికి అవసరమైన సాంకేతిక పరికరాలు, విడిభాగాల తయారీ పరిశ్రమలకు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో తయారీ సంస్థలు, సాంకేతిక సంస్థలు, అనుబంధ పరిశ్రమలు కలిసి పనిచేసే వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించనున్నట్లు వివరించారు. అభివృద్ధిలో వేగమే ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని లోకేష్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయాన్ని ప్రస్తావిస్తూ తమది 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' అని అభివర్ణించారు. స్పీడ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు భవిష్యత్ సాంకేతిక రంగాల్లో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై దృష్టి దేశంలో విస్తరిస్తున్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతరిక్ష రంగానికి అనుబంధంగా పనిచేసే సంస్థలను ఆకర్షించడం ద్వారా పారిశ్రామిక అవకాశాలను విస్తరించాలని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా రాష్ట్రాన్ని అంతరిక్ష పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

