ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వైఎస్సార్‌కు ఘన నివాళి.. పేద విద్యార్థులకు చేయూత

బ్రాహ్మణ వీధిలో వైఎస్సార్ విగ్రహానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల 17వ వర్ధంతి సందర్భంగా బుక్స్, పెన్నులు, బిస్కెట్ల పంపిణీ పోతిన రాము బృందం ఆధ్వర్యంలో కార్యక్రమం.. పలువురు వైసీపీ నేతల హాజరు

V10TV న్యూస్ డెస్క్ 2 సెప్టెంబర్, 2026 2:53 PMకి 1,257 వీక్షణలు
వైఎస్సార్‌కు ఘన నివాళి.. పేద విద్యార్థులకు చేయూత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి బాజీ బాబా అన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ నైజాం గేట్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాజీ బాబా మాట్లాడుతూ వైఎస్సార్ పాలనలో పేదలు, రైతులు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ గృహకల్పన, విదేశీ విద్య, రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టారని బాజీ బాబా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రపాటి తేజ్‌కుమార్, బీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గొలగాని శ్రీనివాసరావు, నాగపావని, డేరంగుల వెంకటరమణ, కుంభ నాగేశ్వరరావు, బత్తుల పాండు, రాజా, మజ్జి శ్రీనివాసరావు, వాసా బాబు, ముక్క రమణ, రాజు రమేష్, కర్రీ గౌరీ, అహ్మద్, అబ్దుల్ గని, నజీరుద్దీన్, అలీ, పల్లె బాబు, ఖాదర్‌బాషా, అబ్దుల్ సత్తార్, మనికి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బందరు డీఎస్పీగా ఆవుల శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

42 నిమిషాల క్రితం 2

‘అక్షరాంధ్ర’తో అక్షర విప్లవం..!

1 గంట క్రితం 1,257

మైనారిటీల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్

3 గంటల క్రితం 1,568

పవన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

3 గంటల క్రితం 1,963