బందరు డీఎస్పీగా ఆవుల శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట... నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి... ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసింగ్‌కు కృషి...

మచిలీపట్నం: బందరు డీఎస్పీగా ఆవుల శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ బందరు పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల ఫిర్యాదులపై సత్వర స్పందన ఉండేలా చూస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
బందరు పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తామని డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు.

