డబ్బుల కోసం వ్యాపారిపై దాడి
షాపు నుంచి బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టిన నిందితుడు… దాడిలో వ్యాపారికి గాయాలు… బాధితుడి ఫిర్యాదుతో కొత్తపేట పోలీసుల కేసు…

విజయవాడ, అక్టోబర్ 3: డబ్బులు ఇవ్వాలంటూ ఓ వ్యాపారిని బెదిరించి, షాపు నుంచి బయటకు తీసుకెళ్లి దాడి చేసిన ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రామవరప్పాడుకు చెందిన రేవంత్ చేపల మార్కెట్ వద్ద వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావుకు డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ అతడిని షాపు నుంచి బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదు అందింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

