18 మందికి రూ.50 లక్షల గృహ నిర్మాణ లబ్ధి పత్రాలు
న్యూ రాజరాజేశ్వరిపేటలో లబ్ధిదారులకు పత్రాల పంపిణీ… ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.57 లక్షల చెక్కులు… పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం: ఎమ్మెల్యే బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 9: పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద రూ.50 లక్షల విలువైన గృహ నిర్మాణ లబ్ధి పత్రాలను అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.57 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనారోగ్యం, అత్యవసర పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, దాసరి ఉదయశ్రీ, నాగుల్ మీరా, స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

