ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట

గుడివాడలో నియోజకవర్గస్థాయి ‘మీకోసం’ కార్యక్రమం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ బాలాజీ నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 5:04 PMకి 2,596 వీక్షణలు
సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట — చిత్రం 1
సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గుడివాడ, సెప్టెంబర్ 25: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోనే అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. గుడివాడ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో శుక్రవారం నియోజకవర్గస్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రాము ఆయా సమస్యల నేపథ్యాన్ని కలెక్టర్‌కు వివరించారు. ప్రతి అర్జీని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను పిలిపించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమస్యల స్వభావాన్ని బట్టి నిబంధనల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని

సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట — అదనపు చిత్రం 2

అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రత్యేక వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. రాబోయే మూడు శుక్రవారాల్లోనూ నియోజకవర్గస్థాయిలో ప్రత్యేక ‘మీకోసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేఆర్ఆర్‌సీ ఎస్‌డీసీ పి నీలకంఠేశ్వరరెడ్డి, గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌రావు, డీపీవో ఎం ధనలక్ష్మి, డీఎస్పీ పాల శ్రీనివాసరావు, డీఎల్‌డీవో సునీతాశర్మ, సర్వే ఏడీ లక్ష్మణరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086