బాధితురాలి వైద్యానికి రూ.2.53 లక్షల భరోసా
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు భవానీపురం కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అనుమతి పత్రం అందజేత సకాలంలో స్పందించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు

విజయవాడ, సెప్టెంబర్ 24: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.53 లక్షల విలువైన వైద్య చికిత్స అనుమతి పత్రాన్ని బాధిత కుటుంబానికి గురువారం అందజేశారు. హెచ్‌బీ కాలనీకి చెందిన ముక్కపాటి వాణి (58) రక్తహీనత, గర్భాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనుమతి పత్రం మంజూరు చేయించారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 42వ డివిజన్ బీజేపీ ఇన్‌ఛార్జి బెన్నా భక్తుల సోమేశ్వరరావు కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అనుమతి పత్రాన్ని అందజేశారు. సకాలంలో సహాయం అందేలా కృషిచేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుజనా మిత్ర సమన్వయకర్తలు పాల్గొన్నారు.

