ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదల సొంతింటి కలకు రూ.60 లక్షల భరోసా

కండ్రికలో 24 మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రాలు… ఒక్కో కుటుంబానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం… అర్హులందరికీ పథకం అందేలా కృషి చేస్తామన్న బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 3:28 PMకి 2,367 వీక్షణలు
పేదల సొంతింటి కలకు రూ.60 లక్షల భరోసా — చిత్రం 1
పేదల సొంతింటి కలకు రూ.60 లక్షల భరోసా — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం 64వ డివిజన్‌ కండ్రిక బస్టాప్‌ సెంటర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన–2.0లోని బీఎల్‌సీ పథకం కింద 24 మంది లబ్ధిదారులకు రూ.60 లక్షల గృహ నిర్మాణ ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని అర్హులైన పేద కుటుంబాలకు పథకం ద్వారా రూ.2.50 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,500 మందికి పైగా లబ్ధిదారులకు ఈ పథకం కింద మంజూరులు చేయించినట్లు బొండా ఉమా వెల్లడించారు. ఎమ్మెల్యే

పేదల సొంతింటి కలకు రూ.60 లక్షల భరోసా — అదనపు చిత్రం 2

కార్యాలయం, డివిజన్‌ నాయకుల సహకారంతో అర్హుల దరఖాస్తులను ప్రభుత్వానికి పంపిస్తున్నామన్నారు. దరఖాస్తులను పరిశీలించి ప్రతి నెలా మంజూరులు వచ్చేలా కృషి చేస్తామని, వచ్చే నెలలోనూ మరో జాబితా విడుదల కానుందని తెలిపారు. ఇటీవల మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశామని గుర్తుచేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన ఇళ్లతోపాటు గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు సొంత గృహాల్లో నివసించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె. రవికుమార్‌, బాబు, పొన్నంగిరి శేషగిరిరావు, వింజమూరి సతీష్‌, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086