ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పెడనలో పేదల వైద్యానికి రూ.59.45 లక్షల సాయం

71 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత… 55 చెక్కులు, 16 వైద్య అనుమతి పత్రాల పంపిణీ… లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 3:22 PMకి 5,553 వీక్షణలు
పెడనలో పేదల వైద్యానికి రూ.59.45 లక్షల సాయం — చిత్రం 1
పెడనలో పేదల వైద్యానికి రూ.59.45 లక్షల సాయం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

పెడన, అక్టోబరు 7: పెడన నియోజకవర్గంలోని నిరుపేదల వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు, అత్యవసర వైద్య చికిత్స అనుమతి పత్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ బుధవారం అందజేశారు. తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు మండలాలకు చెందిన 71 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.59,45,468 విలువైన సహాయాన్ని పంపిణీ చేశారు. ఇందులో 55 చెక్కులు, 16 వైద్య

పెడనలో పేదల వైద్యానికి రూ.59.45 లక్షల సాయం — అదనపు చిత్రం 2

చికిత్స అనుమతి పత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అర్హులైన బాధితులకు సకాలంలో సహాయం అందేలా అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. వైద్య సహాయం మంజూరయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086