పేదల ఇంటికి పట్టాల ఆహ్వానం
లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే బొండా ఉమా... బొట్టు పెట్టి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం... 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 28: సొంతింటి కల సాకారం కానున్న పేద కుటుంబాలను “పేదలకు పట్టాభిషేకం” కార్యక్రమానికి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆహ్వానించారు. సోమవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్‌లో పర్యటించిన ఆయన ఇళ్ల పట్టాలు మంజూరైన లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఆత్మీయంగా కలిశారు. లబ్ధిదారులకు బొట్టు పెట్టి ఈ నెల 30వ తేదీన నిర్వహించే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరుగుతుందని వారికి వివరించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రతి పేద

కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పట్టాలు మంజూరైన లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలను స్వీకరించాలని కోరారు. ఇళ్ల పట్టాలు మంజూరు కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. తమ సొంతింటి కల సాకారం అవుతున్నందుకు ఎమ్మెల్యే బొండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 63వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, డివిజన్ బాధ్యుడు మోత్కూర్ ఖాసీం, కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు లబ్బా దుర్గ, ఎస్‌కే మెహర్ అంజి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

