ట్రాఫిక్ తనిఖీలు.. 40 మందికి జరిమానాలు
హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన… రమేశ్ ఆసుపత్రి కూడలిలో వాహనాల తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన 40 మందికి జరిమానాలు…

విజయవాడ, అక్టోబర్ 8: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతోపాటు దాని క్లిప్‌ను తప్పనిసరిగా బిగించుకోవాలని విజయవాడ ట్రాఫిక్ సీఐ నాగమురళి సూచించారు. గురువారం రమేశ్ ఆసుపత్రి కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 40 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. హెల్మెట్ సక్రమంగా ధరించడం, క్లిప్ బిగించుకోవడంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ ఎంతో కీలకమని నాగమురళి తెలిపారు.

